Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
Mahesh Bigala | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( KCR ) ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని బీఆర్ఎస్ (BRS ) గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల ( Mahesh Bigala ) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రంతో ముడిపెట్టి ఆరోపణలు చేసే సమయంలో వాటి అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత పత్రికపై ఉందని ఆయన అన్నారు.
వివరాలు వెల్లడించకుండా సంచలనాత్మక శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమర్థనీయం కాదని సూచించారు. పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాం. ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిజాన్ని సమర్థిస్తాం. అదే సమయంలో, వ్యక్తుల గౌరవానికి, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచురించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చర్చ వాస్తవాలు, సాంకేతిక వివరాలు, అధికారిక రికార్డుల ఆధారంగానే జరగాలని,ఈ కథనంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ లేవనెత్తిన ప్రశ్నలకు వెలుగు యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులు అందిన 24 గంటల్లో వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకొని కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

