ప్రేమికుల పండుగ సందర్భంగా ఓ వినూత్నమైన ఆలోచనతో ప్రేక్షకులను అలరించనుంది జీ తెలుగు. ప్రేమకు డబ్బు, కులం, మతంతోనే కాదు వయసుతోనూ సంబంధం లేదన్న ఇతివృత్తంతో రూపొందించిన ‘ప్రేమ ఎంత మధురం’సీరియల్ టైటిల్ సాంగ్‌ను మళ్లీ చిత్రీకరించడానికి ఓ పోటీ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వందలాది జంటల్లోంచి భవ్యశ్రీ- రాహుల్, దీప్తి- మహేశ్, ప్రదీశా – సందీప్… జంటలను ఎంపికచేసి టైటిల్ సాంగ్ చిత్రీకరించింది. ఈ మూడు జంటలతో కలిసి సీరియల్ ప్రేమజంట అను ఆర్యవర్ధన్ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. మూడు రియల్ జంటలు రీల్ జంటతో కలిసిచేసిన టైటిల్ సాంగ్‌ను ‘ప్రేమికుల దినోత్సవం’రోజు సీరియల్ ప్రారంభంలో ప్రసారం చేయనుంది.