Meteorite Hits Woman | మేడపై కాఫీ తాగుతున్న మహిళపై పడిన ఉల్క.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Meteorite Hits Woman | స్నేహితురాలితో కలిసి మేడపై కాఫీ తాగుతున్న మహిళపై ఉల్క పడింది. (Meteorite Hits Woman). శరీరం ముందు భాగానికి బలంగా తగిలి కింద పడిన దానిని తొలుత రూఫ్ సిమెంట్ లేదా గబ్బిలం కావచ్చని ఆమె భావించింది. అయితే పరిశీలించి చూడగా ఆకాశం నుంచి దూసుకొచ్చిన చిన్న రాయి తన మీద పడినట్లు ఆమె గ్రహించింది.
పారిస్: స్నేహితురాలితో కలిసి మేడపై కాఫీ తాగుతున్న మహిళపై ఉల్క పడింది. (Meteorite Hits Woman). శరీరం ముందు భాగానికి బలంగా తగిలి కింద పడిన దానిని తొలుత రూఫ్ సిమెంట్ లేదా గబ్బిలం కావచ్చని ఆమె భావించింది. అయితే పరిశీలించి చూడగా ఆకాశం నుంచి దూసుకొచ్చిన చిన్న రాయి తన మీద పడినట్లు ఆమె గ్రహించింది. ఫ్రాన్స్‌లోని షిర్మెక్లో ఈ సంఘటన జరిగినట్లు ఆ దేశ వార్తా పత్రిక డీఎన్ఏ పేర్కొంది. ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి టెర్రెస్‌పై ఉన్న రూఫ్ కింద కాఫీ తాగుతున్నది. అయితే ఉన్నట్టుండి ఆమె శరీరం ముందు భాగాన్ని ఏదో బలంగా తగిలినట్లు అనిపించింది. గబ్బిలం లేదా రూఫ్ సిమ్మెంట్ పడి ఉంటుందని తొలుత ఆమె భావించింది. పరిశీలించి చూడగా తనపై పడిన వస్తువు చిన్న రాయిగా ఆ మహిళ గుర్తించింది. అక్కడ అలాంటి చిన్న రాళ్లు మరికొన్ని పడి ఉన్నాయి. వంద గ్రాముల కంటే ఎక్కువ బరువున్న ఆ చిన్న రాళ్లు పడే ముందు శబ్ధం కూడా వచ్చినట్లు ఆమె చెప్పింది.

Meteorite Stones
కాగా, ఆ మహిళ తొలుత ఆ చిన్న రాళ్లను రూఫ్ నిర్మించే స్థానిక వ్యక్తికి చూపించింది. అవి ఉల్కలకు చెందినవి కావచ్చని అతడు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో జియోలజిస్ట్ అయిన డాక్టర్ థియరీ రెబ్మాన్కు వాటిని చూపించింది. పరిశీలించిన ఆయన ఆ చిన్న రాళ్లను ఉల్కలుగా నిర్ధారించారు. ఐరన్, సిలికాన్‌తో కూడిన ఆ రాళ్లు అంతరిక్షం నుంచి భూమిపై పడి ఉండవచ్చని తెలిపారు. ఆకాశం నుంచి రాలిపడే ఉల్కలు చిన్న గ్రహ శకలాల నుంచి దుమ్ము రేణువు వంటి పరిమాణంలో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు సుమారు 50 టన్నుల మేర ఉల్క పదార్థాలు భూమిపై పడతాయని నాసా అంచనా వేసినట్లు వెల్లడించారు. అయితే అవి నేరుగా మనుషులపై పడటం చాలా అరుదుగా జరుగుతుందన్నారు.
మరోవైపు ఒక ఉల్క నేరుగా వ్యక్తిపై పడిన తొలి సంఘటన 1954లో జరిగింది. అమెరికాలో ఒక ఇంటి పైకప్పు నుంచి దూసుకొచ్చిన 3.6 కిలోల బరువున్న ఉల్క రాయి ఒక మహిళపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

