మనసుకు నచ్చిన వ్యక్తులతో ఉంటే.. మానసిక బంధం పెనవేసుకుంటుంది
ఇద్దరు వ్యక్తులు ఎక్కువ సమయం కలిసి రోజును గడుపుతుంటే.. వారి మధ్య ఒక అద్భుతమైన మానసిక బంధం పెనవేసుకుంటుంది. ఎలాంటి ప్రయత్నం లేకుండానే.. వారిలో ఒకరినొకరు అనుకరించడం మొదలవుతుంది.
ఇన్ఫోగ్రాఫిక్
మీరు మారిపోతారోచ్
ఆరు నెలల సావాసం.. వారిని వీరిలా మార్చేస్తుందని చెబుతారు. దంపతుల విషయంలోనూ ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఇద్దరు వ్యక్తులు ఎక్కువ సమయం కలిసి రోజును గడుపుతుంటే.. వారి మధ్య ఒక అద్భుతమైన మానసిక బంధం పెనవేసుకుంటుంది. ఎలాంటి ప్రయత్నం లేకుండానే.. వారిలో ఒకరినొకరు అనుకరించడం మొదలవుతుంది. ఎందుకంటే.. మనసుకు నచ్చిన వ్యక్తులతో ఉన్నప్పుడు మెదడు సహజంగానే వారితో సర్దుకుపోతుంది. ఈ మార్పు.. వారిద్దరి మధ్య గాఢమైన భావోద్వేగ బంధానికి, పరస్పర అవగాహనకు నాంది పలుకుతుంది.
ఈ విషయంలో మొదటగా మారేది.. వారి భాష! భాగస్వామి మాత్రమే వాడే కొన్ని పదాలు, జోకులు లేదా ప్రత్యేకమైన పదబంధాలను ఎదుటివారు కూడా వాడటం ప్రారంభిస్తారు. మాట్లాడే శైలి, ‘సరే!’ అని చెప్పే ప్రత్యేకమైన విధానం, ఒకరి నవ్వును మరొకరు పోలి ఉండటం లాంటివి కాలక్రమేణా కలిసిపోతాయి. చివరికి ఒకరి వాక్యాన్ని మరొకరు అచ్చం అదే పదాలతో పూర్తి చేస్తుంటారు.
మాటతీరే కాదు.. శరీర భాష కూడా క్రమంగా ఒక్కటైపోతుంది. సోఫాలో కూర్చునే విధానం, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నిలబడే తీరులోనూ పోలిక కనిపిస్తుంది. జంటలు తరచూ ఒకేలా కూర్చోవడం, ఒకే సమయంలో కాళ్లు లేదా చేతులు మార్చడం, సరిగ్గా ఒకే వేగంతో నడవడం లాంటివి చాలామందిలో గమనించొచ్చు.

Change Lifecycle
ఎదుటివారి జీవనశైలికి అనుగుణంగా.. భాగస్వామి జీవ గడియారం కూడా మారుతుంది. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకునే అబ్బాయి.. పెండ్లి తర్వాత ఉదయాన్నే నిద్ర లేచేస్తాడు. భర్త నైట్ షిఫ్ట్‌లు చేసేవాడైతే.. అందుకు తగ్గట్టు భార్య కూడా తన జీవన శైలిని మార్చుకుంటుంది. క్రమంగా వారి జీవగడియారం కూడా అలాగే సర్దుబాటు అవుతుంది.

Change Likes
భాగస్వామికి ఏదైనా ప్రత్యేకమైన వంటకం ఇష్టమైతే.. రెండో వ్యక్తి కూడా దానికి అలవాటు పడతారు. నచ్చని వంటలకు దూరంగానూ ఉంటారు. పెండ్లికి ముందు కాఫీ ముట్టనివారు.. భాగస్వామితో కలిసి రోజూ రెండుమూడు కప్పులైనా లాగించేస్తారు. చివరికి కిరాణా కొనుగోళ్లలో ఎంచుకునే బ్రాండ్లను కూడా.. క్రమంగా ఉమ్మడి ఇష్టాలుగా మార్చుకుంటారు.

Music Library
మ్యూజిక్ లైబ్రరీ, సినిమా జానర్లు కూడా.. ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఇంతకుముందు అంతగా నచ్చని మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా క్రమంగా ఇష్టపడతారు. ఇంట్లో-కారులో ఆ పాటే ప్లే అవుతుంటే.. ఆనందంగా వినడం ప్రారంభిస్తారు. హీరోలు, సినిమాల విషయాల్లోనూ.. ఉమ్మడి అజెండాకే ‘జై’ కొడుతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

