బెంగాల్లో అధికారంలోకి రాగానే వాళ్ల సంగతి చెబుతాం: యోగీ ఆదిత్యనాథ్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార్టీ వాళ్లపై దాడులకు పాల్పడిన అందరిపైనా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌పైన, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైన యోగి మండిపడ్డారు.
‘మే 2 తర్వాత పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యర్తలపై టీఎంసీ నేతలు అనేక దాడులకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో గూండా పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే అందుకు కారణమని, ఆమె ప్రోద్బలంతోనే యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

