Whatsapp | ఫోన్లో నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్ పంపవచ్చు.. ఎట్లనో తెలుసా..!
Whatsapp | మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ (Messaging Social Media App) వాట్సాప్ (WhatsApp) గురించి తెలియని వాళ్లు చాలా తక్కువ. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తారు. ఈ యాప్‌లో ఫోటోలు, వీడియోలతోపాటు కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా వాట్సాప్‌ను ఉపయోగిస్తారు.
Whatsapp : మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ (Messaging Social Media App) వాట్సాప్ (WhatsApp) గురించి తెలియని వాళ్లు చాలా తక్కువ. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తారు. ఈ యాప్‌లో ఫోటోలు, వీడియోలతోపాటు కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా వాట్సాప్‌ను ఉపయోగిస్తారు. ఈ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినూత్న అప్డేట్స్తో ముందుకు వస్తుంది. సాధారణంగా అయితే మన కాంటాక్ట్స్ లిస్టు (Contacts List) లో లేని వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే ముందుగా అతని నెంబర్ సేవ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నంబర్ సేవ్ చెయ్యకుండానే కొత్త వాళ్లకు మెసేజ్ పంపవచ్చు. వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ (WatsApp search bar feature) అందుబాటులోకి రావడంతో నంబర్ సేవ్ చేయాల్సిన అవసరం తప్పింది. ఆ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే నంబర్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపవచ్చు. అదెట్లనో ఇప్పుడు తెలుసుకుందాం..
సేవ్ చేయని నెంబర్‌కు మెసేజ్ పంపడం ఇలా..
ముందుగా మన మొబైల్ ఫోన్లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
ఐఫోన్ యూజర్లైతే వాట్సాప్ యాప్ పైభాగంలో ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లైతే కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత సెర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి మెసేజ్ పంపదల్చుకున్న నంబర్‌ను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి.
ఆ నెంబర్‌కు వాట్సాప్ అకౌంట్ ఉంటే చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఆ నంబర్‌తో వాట్సాప్ మెసేజ్ చెయ్యవచ్చు.
ఇవేగాక వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

