న్యూఢిల్లీ: చాట్స్‌ను ఒక భాష నుంచి మరొక భాషకు అనువదించే ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నది. ఇది అందుబాటులోకి వస్తే, వాట్సాప్ యూజర్లు ఓ ఉమ్మడి భాష అవసరం లేకుండానే పరస్పరం సందేశాలు, భావాలను పంచుకోవచ్చు. ఉదాహరణకు, ‘హలో’ అని ఆంగ్లంలో ఓ యూజర్ సందేశాన్ని పంపిస్తే, దానిని స్వీకరించే హిందీ యూజర్లకు ‘నమస్తే’ అని వెళ్తుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.12.25లో కొత్త ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ కనిపించింది. ఇది ప్రస్తుతం కొందరు బీటా టెస్టర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న కొద్ది వారాల్లో బీటా చానల్లో అందుబాటులోకి వస్తుంది. యూజర్లందరికీ అందుబాటులోకి రావడం గురించి సమాచారం లేదు.