మహబూబ్‌నగర్ రూరల్, మార్చి 18 : మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ క్షేత్రం దిగువన అలివేలు మంగ ఆలయంలో బ్ర హ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉ త్సవాల్లో ప్రధాన ఘట్టమైన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగతాయారు అమ్మవారి క ల్యాణాన్ని శుక్రవారం వేదమంత్రోచ్ఛారణాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శా రద పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖు లు ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దే వేందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, కోటకదిర సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
జడ్చర్ల, మార్చి 18 : పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణం కమనీయంగా సాగింది. శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకుని వెంకన్న స్వామి, అమ్మవార్లకు కల్యాణాన్ని అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తు లు వేలాదిగా తరలివచ్చారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆల య వంశపారంపర్య ధర్మకర్త భీంసేనాచార్యులు, సుదీంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, మార్చి 18 : మండల కేంద్రంలో స్వ యంభూగా వెలిసిన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి క ల్యాణం కమనీయంగా సాగింది. శుక్రవారం ఆల య ఆవరణలోని మండపంలో భూలక్ష్మీ, శ్రీదేవి సమేతుడైన వెంకన్న స్వామికి కల్యాణ వేడుక నిర్వహించారు. ఆలయ అర్చకులు రమేషాచారి, మ ధుసూదనాచారి, రవిచారి వేద మంత్రోచ్ఛరణల మధ్య వేడుక జరిపారు. మండల కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి వసతులు కల్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, నాగరాజాచారి, బాబురావు, వెంకోబరావు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
బిజినేపల్లి, మార్చి 18 : మండలంలోని వట్టెం అడ్డగట్టుపై గోవింద నామస్మరణ మార్మోగింది. అ లివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యా ణం శుక్రవారం ఘనంగా జరిగింది. భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయత్వం చెందారు. అంతకుముందు ఉదయం సేవాకాలం, హోమాలు, బాలభోగ నివేదన, పూర్ణాహుతి, రాజభోగ నివేదన, సాయంత్రం సమయరాధన, హోమాలు, నివేదన, పూర్ణాహుతి, బలిదానం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి, న ర్సింహారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వట్టెం వెంకన్న స్వామిని నాగర్‌కర్నూల్ కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ దంపతులు, అదనపు కలెక్టర్ మనూచౌదరి దర్శించుకున్నారు. ఆలయంలోని అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ అనం త నర్సింహారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యు లు ప్రతాప్‌రెడ్డి, చంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డి, అమృత్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.