VJ Sunny | బిగ్ బాస్ సీజన్ 5 ఫేం వీజే సన్నీ (VJ Sunny) నటిస్తోన్న చిత్రం అన్‌స్టాపబుల్ (Unstoppable). అవుట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ షూటింగ్లో ప్రమాదం జరిగింది. థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, వీజే సన్నీ ప్రోమో షూట్లో పాల్గొన్నారు. పోలీస్ గెటప్‌లో ఉన్న సప్తగిరి రివాల్వర్ చూపిస్తూ.. పృథ్విని అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడని అడుగగా.. పృథ్వి తనకు తెలియదని సమాధానం చెప్పాడు.
ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చిన వీజే సన్నీపై రివాల్వర్ ఎక్కుపెట్టి సప్తగిరి అదే ప్రశ్న అడుగుతాడు. అయితే ఇదే క్రమంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్ పేలి.. అందులో ఉన్న డమ్మీ బుల్లెట్ సన్నీ భుజంపై తాకింది. దీంతో గాయమైన వీజే సన్నీని చిత్రయూనిట్ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమోషనల్ షూటింగ్..