VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
VishwakSen | తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) సినిమా గురువారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) సినిమా గురువారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంపై సీనియర్ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి (VSN Murthy) చేసిన పరోక్ష వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను ప్రశంసిస్తూ.. “కుర్రాళ్ల సినిమా అంటే ఇది.. పిచ్చి గెంతులు, బూతు జోకులు కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ‘ఈఎన్ఈ రిపీట్’ను ఉద్దేశించేనంటూ చర్చ మొదలైంది. అయితే ఈ విమర్శలపై హీరో విశ్వక్ సేన్ ఘాటుగా స్పందించారు. మరొక సినిమాను పొగుడుతూ, తమ చిత్రాన్ని పరోక్షంగా తక్కువ చేసి చూపేలా మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు.
‘కుర్రాళ్ల గురించి, వాళ్ల టేస్ట్ గురించి, టెస్టోస్టిరాన్ గురించి అంచనాలు వేసేంత అప్డేటెడ్గా మీరు ఉన్నారా? అన్నది నా రివ్యూ. ఒక సినిమాను మెచ్చుకోండి.. అంతేగానీ మరో సినిమాను తక్కువ చేసి మాట్లాడకండి. సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పాటు పెరగాలి కానీ, తరగకూడదు’ అంటూ విశ్వక్ సేన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
@sairaaj44 Kurralla gurinchi valla taste gurinchi , testosterone gurinchi anchanalu vese antha updated meeru unnara? Ani na review . Praise one , don’t degrade other one . Samskaram , manchithanam anevi vayasu tho pergali, tharagodhu
— VishwakSen (@VishwakSenActor) November 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

