బిగ్ బాస్ సీజన్ 5లో సోమవారం ఎపిసోడ్ రంజుగా సాగింది. సోమవారం కావడంతో నామినేషన్ రచ్చ కామన్‌గా ఉంటుంది. అంతముందు కాజల్ కోరిక మేరకు నాగార్జున మటన్ బిర్యానీ ఐటమ్స్ పంపించగా, హమీదా సాయంతో కాజల్ గరిటె తిప్పింది. ఎలాగోలా మటన్ బిర్యానీ వండేసింది. ఇక విశ్వ..షణ్ముఖ్ ఓ దగ్గర కూర్చొని సాధక బాధలు చెప్పుకున్నారు.
విశ్వ.. తన గోడుని షణ్ముఖ్ దగ్గర వెళ్లబుచ్చకుంటూ… ఇక్కడికి వచ్చే మందు నా దగ్గర డబ్బులు కూడా లేవు. భార్య, పిల్లాడికి ఏదైన కొందాం అన్నా డబ్బులు కూడా లేవు. నాలుగు నెలలు అద్దె కట్టలేదు. పిల్లోడు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే అత్తమామలు సాయం చేశారు. ఏ రోజు కూడా ఎవరి ముందు చేయి చాచలేదు. ఈ గేమ్ నాకు చాలా అవసరం అంటూ షణ్ముఖ్ ఏడ్చేశాడు. ఈ క్రమంలో షణ్ముఖ్..విశ్వని ఓదార్చాడు.
ఇక ఈ సీజన్లో తొలిసారి పట్టపగలు షణ్ముఖ్ నిద్రపోయాడు. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ విశ్వ..షణ్ముఖ్‌కి శిక్ష విధించాడు. స్విమ్మింగ్ పూల్‌లో 21 సార్లు దూకాలని చెప్పడంతో షణ్ను తనకు విధించిన శిక్షను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇతను మిలిటరీ మ్యాన్‌లా ఉన్నాడంటూ ప్రియ పంచ్ వేసింది.