Sonakshi Sinha : బాలీవుడ్ నటి (Bollywood actress) సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) దంపతులు 2025 సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ముద్దుల్లో (Kisses) మునిగిపోతూ ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ (Sidney) నగరంలో న్యూ ఇయర్ వేడుకలు (New year celebrations) జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోనాక్షి కపుల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సోనాక్షి సిన్హా అభిమానులను ఉద్దేశంచి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెబుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత తన భర్త జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) చెంపపై ముద్దు పెట్టింది. ఈ సమయంలో వారి వెనుక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఫైర్ క్రాకర్స్ పేలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వేడుకలను వీక్షిస్తూ సోనాక్షి మరోసారి భర్త మెడపై ముద్దుపెట్టగా.. అందుకు స్పందనగా జహీర్ కూడా సోనాక్షి తల నిమురుతూ ముద్దులు పెట్టాడు.
ఈ వీడియోను సోనాక్షి దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘హమారా హ్యాప్పీ న్యూ ఇయర్ హోగయా.. హ్యాప్పీ న్యూ ఇయర్ ఫ్రమ్ సిడ్నీ (Humara Happy New Year ho gaya!!! Happyyyyyyy Newwwww Yearrrrrr from @sydney) అనే క్యాప్షన్ ఇచ్చారు. ఎంతో ఉత్సాహంతో సోనాక్షి దంపతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు…