Dallas | డాలస్, టెక్సాస్: ‘వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘కవికులాలంకార’ వేటూరి (Veturi) సుందర రామమూర్తి సాహితీ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాని ఫ్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేటూరి విరచిత 8 సినీ, సినీయేతర గీత సంపుటాలను ఆవిష్కరించారు. వేటూరి ప్రత్యేక పాటలపై నృత్య, సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు వేదకవి, ప్రముఖ సినీగీత రచయిత, దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి తొలి గ్రాంథాన్ని విశిష్ట అతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం నాగేశ్వరరావుకు, అతిథులుగా హాజరైన వామరాజు సత్యమూర్తికి, డాక్టర్ కొమాండూరి రామాచారికి అందజేశారు.

Dallas Veturi 1
వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా (America) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ పోణంగి ఆధ్వర్యలో సాహిత్య సంపుటాలను ప్రచురించడానికి సహాయ సహకారాలు అందించిన వారిలో హాజరైన డాక్టర్ బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డాక్టర్ సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారథి జీడిగుంట, వినోద్ ఉప్పులను సత్కరించారు. వేటూరితో సుదీర్ఘకాలం సాహిత్య ప్రయాణంచేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డాక్టర్ ప్రసాద్ తోటకూర వేటూరు జీవితం గురించి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పాత్రికేయునిగాఉన్న వేటూరి నందమూరి తారకరామారావు కోరిక మేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చెయ్యడం. సినీపరిశ్రమలో ముఖ్యభాగం అవడం. ఆయన కవితావైభవం, వ్యక్తిత్వం, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ్’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి రచనలు, వేటూరి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు, వివిధ అంశాలపై నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమం నవ్వులు పూయించింది.

Dallas Veturi 3
ఈనాడు దినపత్రిక సంపాదకులు (Editor) ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వేటూరి పాటలలో గొప్పవి ఏవి ఆని chaat gpt ని అడిగితే.. ఎంపిక చెయ్యడం కష్టం అనే సమాధానం వచ్చిందని అన్నారు. దీన్నిబట్టి వేటూరి ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. 18 సంవత్సరాలు పాత్రికేయునిగా పనిచేసిన వేటూరిని ఈనాడు జర్నలిజం స్కూల్‌కు ఆహ్వానించి విద్యార్థులతో మాట్లాడించానని గుర్తు చేశారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ వేటూరి అని తెలిపారు. ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకపు పాటనైనా అక్షరాల్లో ఆవిష్కరించగల దిట్ట అని కొనియాడారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదని అన్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ.. డాక్టర్ ప్రసాద్ తోటకూర నిర్వహణలో జనవరిలో హైదరాబాద్ (Hederabad)లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ సభలో, మళ్లీ డాలస్‌లో జరిగిన సభ రెండింటిలోనూ పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు.
ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ సంగీతగురు డాక్టర్ కొమండూరి రామాచారి వేటూరితో తనకున్న అనుబంధాన్ని, గీత రచనా శైలిని ప్రశంసిస్తూ కొన్ని పల్లవులను పాడారు.
గాయకులు, సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. స్థానిక గాయనీ గాయకులు సంతోష్ ఖమ్మంఖర్, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, జానకి శంకర్, శ్రేయస్ సూరిభొట్ల, సాహితి కోటంరాజు పాటలు పాడారు. రాజశేఖర్ కీబోర్డ్, ముద్దు పాయ్ కీబోర్డు, గిటార్‌పై, రాం యామిజాల, నీవ్ యామిజాల పెర్కషన్ వాయిద్యాలపై సంగీతం అందించారు. సౌండ్ ఇంజినీర్‌గా రవి మాచ, రవి రావు భట్టిప్రోలు పనిచేశారు. వేటూరి రాసిన ‘ఓం నమః శివాయ (సాగర సంగమం)’ పాటకు గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు నృత్యం చేశారు. ‘జగతి సిగలో జాబిలమ్మకు (పరదేశి)’ పాటకు రాగమయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ & యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ల నృత్యం చేశారు. ‘నెమలికి నేర్పిన నడకలివి (సప్తపది)’ పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ నృత్యం చేశారు. ‘మధుర మధురతర మీనాక్షి (అర్జున్)’ గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలను నృత్యం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్, కౌన్సిల్ మెంబర్ యాన్ యాన్దర్సన్లను సత్కరించారు. అదేవిధంగా ఇటీవల కొలంబియాలో 8 సంవత్సరాల్లోపు పిల్లకు జరిగిన చదరంగం పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన సరయు తలపనేనిని టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్ సత్కరించి, ఆమె తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి MCలుగా నిర్వహించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరి, శుభం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు కిశోర్ నారె, పావని నున్న, నాగరాజు నలజల, నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపప్ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Dallas Veturi 2

Dallas Veturi 4

Dallas Veturi 5

Dallas Veturi 6

Dallas Veturi 7

Dallas Veturi 8

Dallas Veturi 9

Dallas Veturi 10

Dallas Veturi 11

Dallas Veturi 12