టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం వకీల్‌సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 9 విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా వకీల్‌సాబ్ మ్యూజిక్ ఫెస్టివల్ న్యూస్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. వకీల్‌సాబ్ మ్యూజిక్ ఫెస్ట్‌ను థమన్ అండ్ మేకర్స్ టీం మార్చి 23న వైజాగ్‌లోని విజ్ఞాన్ కాలేజ్ ఉదయం (10 గంటలు), కాకినాడలోని కైట్ కాలేజ్(మధ్యాహ్నం 3.30 గంటలు) లో నిర్వహించనున్నారు.
డైరెక్టర్ వేణు శ్రీరామ్, థమన్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, ఇతర టీం మెంబర్స్ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. ఈ సారి మేకర్స్ కాలేజ్ విద్యార్థులను ఆకట్టుకునే లక్ష్యంతో ముందుకెళ్తుంది. నివేదా థామస్, అనన్య నాగళ్ల, శృతిహాసన్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు-బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.