INDA vs SLA : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ఏ(India A) జట్టు జయభేరి మోగించింది. దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక ఏ జట్టును టీమిండియా చిత్తు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(94) తుఫాన్ ఇన్నింగ్స్‌తో కుదేలైన లంక.. గట్టిగానే పోరాడింది. వనుజ సహన్(62), సమరవిక్రమ(52)లు అర్థ శతకాలతో రాణించినా సరిపోలేదు. యశ్ ఠాకూర్(3-45), అనుకుల్ రాయ్(39, 2-42) ఆల్‌రౌండ్ షో తోడవ్వగా 66 పరుగుల తేడాతో టీమిండియా విజేతగా నిలిచింది.
మూడు దేశాల వన్డే సిరీస్ ఫైనల్లో టీమిండియా ఏ ధాటికి శ్రీలంక ఏ జట్టు చేతులెత్తేసింది. 378 పరుగుల ఛేదనను ధాటిగా ఆరంభించాలనుకున్న లంకను యశ్ ఠాకూర్(3-45) ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఠాకూర్ విజృంభ ణతో 75కే మూడు వికెట్లు కోల్పోయిన లంకను సమరవిక్రమ(52), రవిందు ఫెర్నాండో(19) అదుకున్నారు.
Innings Break!
India A put up a massive total of 3️⃣7️⃣7️⃣/9 on the board in the #TriNationSeries Final 👏
Over to the bowlers!
Updates ▶️ https://t.co/CnmyVyoyjy#SLAvINDA pic.twitter.com/Etd1cckYjw
— BCCI (@BCCI) June 21, 2026
ఈ జోడీని తిలక్ వర్మ విడదీయగా.. సహన్ అరాచ్చిగే(38), వనుజ సహన్(62)లు కాసేపు ప్రతిఘటించారు. అయితే.. విప్రజ్ నిగమ్(), అనుకుల్ రాయ్(39, 2-42) ఆల్‌రౌండ్ షో తోడవ్వగా 66 పరుగుల తేడాతో టీమిండియా విజేతగా నిలిచింది
ఫైనల్లో భారత ఏ జట్టు మొదట కొండంత స్కోర్ కొట్టింది. శ్రీలంక బౌలర్లను భయపెడుతూ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(94) కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకంతో చెలరేగాడు. పవర్ ప్లేలోనే వైభవ్ ఊచకోతతో అలవోకగా టీమిండియా నాలుగొందలు కొడుతుందనిపించింది.
కానీ, కెప్టెన్ తిలక్ వర్మ(67) మినహా ఎవరూ రాణించలేదు. .మిడిలార్డర్ వైఫల్యం, డెత్ ఓవర్లలో భారత ఆటగాళ్లను లంక పేసర్లు గొప్పగా కట్టడి చేశారు. కుమార్ కుషగ్ర(39), ఆఖర్లో అనుకుల్ రాయ్(39) మెరుపులతో భారత ఏ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగులతో లంకకు సవాల్ విసిరింది.