FIH Nations Cup | న్యూజిలాండ్‌కు షాక్.. ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ విజేతగా టీమిండియా..!
FIH Nations Cup : ఆసియా క్రీడలకు ముందే భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ (FIH Nations Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ ట్రోఫీని కొల్లగొట్టింది.
FIH Nations Cup : ఆసియా క్రీడలకు ముందే భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ (FIH Nations Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ ట్రోఫీని కొల్లగొట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ రెండోసారి కప్‌ను ఒడిసిపట్టింది. టైటిల్ పోరులో నవ్‌నీత్ కౌర్, సునేలిటా టొప్పొలు చెరొక గోల్ కొట్టగా.. 2-0తో కివీస్ మట్టికరిచింది.
ఆక్లాండ్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్‌లో భారత జట్టు టైటిల్ పట్టేసింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను టీమిండియా 2-0తో ఓడించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నవనీత్ కౌర్ 4వ నిమిషంలోనే తొలి గోల్ కొట్టగా భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఖాతా తెరిచేందుకు కివీస్ జట్టు ఎంతగానో ప్రయత్నించినా భారత డిఫెండర్లు ఏమాత్రం అవకాశమివ్వలేదు.
🏆 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒! 🏆
The Indian Women’s Hockey Team reigns supreme at the FIH Hockey Women’s Nations Cup New Zealand 2025–26! 🇮🇳💙
A campaign defined by resilience, belief and brilliant teamwork ends with the trophy in Indian hands. 👏🏑#HockeyIndia #IndiaKaGame… pic.twitter.com/Zp6O29Xm2o
— Hockey India (@TheHockeyIndia) June 21, 2026
ప్రత్యర్థికి షాకిస్తూ సునేలిటా టొప్పో 15వ నిమిషంలో గోల్‌తో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. ఫైనల్లో అద్బుతంగా రాణించిన ఫార్వర్డ్ లల్రేమ్సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది. టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడిన దీపిక ఆరు గోల్స్‌తో అమెరికా ప్లేయర్ అష్లే సెస్సాతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పంచుకుంది.
Thank you, Hon’ble Prime Minister Shri Narendra Modi ji, for your kind wishes. The team is honoured by your appreciation and will continue striving to make India proud. 🇮🇳 https://t.co/6ACvTKT2kR
— Hockey India (@TheHockeyIndia) June 21, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

