హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 4 కోట్ల డోసులకు చేరువైంది. బుధవారం నాటికి 3.99 కోట్లకుపైగా డోసులు వేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో బుధవారం కొత్తగా 205 కేసులు నమోదయ్యాయి. 185 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,871 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 79, హన్మకొండ 19, మేడ్చల్ మల్కాజిగిరి 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెలుగు చూశాయి.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వివరాలు
టీకా: బుధవారం :మొత్తం
మొదటి డోస్ :1,67,597 :2,60,47,829
రెండో డోస్ :1,41,959 :1,38,73,984
మొత్తం :3,09,556: 3,99,21,813