JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
JD Vance | భారతదేశం (India) విషయంలో తాను హద్దులు దాటానని అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తాను ఆ పదం వాడి ఉండాల్సింది కాదని అన్నారు. ఇటీవల కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys), టాటా (TATA), విప్రో (WIPRO), హెచ్సీఎల్ (HCL), క్యాప్జెమిని (Capgemini) కంపెనీలను పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసిన సందర్భంగా వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
JD Vance : భారతదేశం (India) విషయంలో తాను హద్దులు దాటానని అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తాను ఆ పదం వాడి ఉండాల్సింది కాదని అన్నారు. ఇటీవల కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys), టాటా (TATA), విప్రో (WIPRO), హెచ్సీఎల్ (HCL), క్యాప్జెమిని (Capgemini) కంపెనీలను పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసిన సందర్భంగా వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై తాజాగా వాన్స్ స్పందించారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ విషయంలో అప్పుడు తాను హద్దులు దాటి మాట్లాడానని అన్నారు. ‘విదేశీ ఒప్పంద పనివాళ్లు’ అని తాను వాడిన పదం సరైనది కాదని ఒప్పుకున్నారు. తన ప్రసంగంలో ఏమైనా లోపాలు ఉంటే.. అది తన తప్పేనని అంగీకరించారు. అయితే హెచ్-1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకోవాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు.
తాను అమెరికా కంపెనీలు, వీసా వ్యవస్థ గురించి మాట్లాడాలనుకున్నానని వాన్స్ తెలిపారు. ఉద్యోగులు అమెరికాకు హెచ్-1బీ వీసాపై వస్తారని, వారిని తీసుకున్న కంపెనీలు ఆ పనికి ప్రత్యామ్నాయ అమెరికన్ కార్మికుడు దొరకలేదని పేర్కొంటాయని చెప్పారు. దాంతో స్థానికులకు అవకాశాలు దక్కవని, దేశంలో తరచుగా ఇదే జరుగుతోందని అన్నారు. అందుకే తాను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
కాగా హెచ్-1బీ వీసాలపై నియమించుకునే విదేశీ ఉద్యోగులను ‘విదేశీ ఒప్పంద పనివాళ్లు’ గా, ఆ ప్రోగ్రామ్ను ఉపయోగించుకునే కంపెనీలను ‘వీసా మిల్లులు’ గా వాన్స్ అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నిపుణుల తరలింపు అనేది భారతీయులకు అవకాశాలు కల్పించడంతోపాటు అమెరికా కంపెనీల సంపదను కూడా పెంచుతుందని పేర్కొన్నది. ఈ విషయంపై వాన్స్ అనవసరంగా మాట్లాడారని అభిప్రాయపడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

