Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Greater Noida : గ్రేటర్ నోయిడాలో భారీ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఈ ల్యాబ్ నుంచి రూ.45 కోట్ల విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Greater Noida : గ్రేటర్ నోయిడాలో భారీ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఈ ల్యాబ్ నుంచి రూ.45 కోట్ల విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక విదేశీయుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. డ్రగ్స్ తయారీకి సంబంధించి ఎన్సీబీకి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.
దీని ప్రకారం ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడా పరిధి, గౌతమ్ బుద్ధా నగర్ జిల్లా, జహంగాబాద్ కదాల్పూర్ గ్రామంలో విదేశీయులు ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నిందితులు రెండు వేర్వేరు ఇండ్లను అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఒక ఇల్లును రా మెటీరియల్ నిల్వ చేసేందుకు వాడుతున్నారు. ఇంకో ఇంటిని ఈ మెటీరియల్‌ను ప్రాసెస్ చేసేందుకు, డ్రగ్స్ తయారీకి వినియోగిస్తున్నారు. దీనిపై అందిన సమాచారంతో అక్టోబర్ 16న ఎన్సీబీ అధికారులు ఆ ఇండ్లపై దాడి చేశారు.
అక్కడ భారీ స్థాయిలో డ్రగ్స్, ముడి పదార్థాలను అధికారులు గుర్తించారు. వీటిని తయారు చేసేందుకు అవసరమైన ల్యాబ్‌ను కూడా గుర్తించారు. ఘటనా స్తలం నుంచి 379 కిలోలీ విలువైన అంఫీటమైన్ అనే కెమికల్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఇతర కెమికల్స్ కూడా ఉన్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.45 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను కూడా ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అబ్రహం డుంబిరి, లల్లావంజువాలి అలియాస్ ఒలివియాగా గుర్తించారు. ఒలివియా మిజోరంనకు చెందిన యువతి.
అబ్రహం నైజీరియా దేశస్తుడు. వీరిలో ఒలీవియా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టైంది. హెరాయిన్ పట్టుబడిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం పోలీసులు డ్రగ్స్ తయారు చేస్తున్న రెండు ప్రదేశాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ల్యాబ్‌ను సీజ్ చేశారు. నిందితులు ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

