Trump and Clinton | సెక్స్ కుంభకోణంలో ట్రంప్, క్లింటన్!

- ప్రధాన నిందితుడు జెఫ్రీ
- స్నేహితురాలు గిస్లెయిన్
- అరెస్టుతో మళ్లీ తెరపైకి
న్యూయార్క్: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బ్రిటన్ రాణి కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ, ప్రముఖ అటార్నీ అలన్ డెర్షోవిజ్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ కుంభకోణంలో పాలుపంచుకొన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాన నిందితుడు, ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ స్నేహితురాలు గిస్లెయిన్ మాక్స్వెల్ (60) ఇటీవల ఇదే కేసులో అరెస్టయ్యారు. 14 ఏండ్ల బాలికలను సంపన్నుల వద్దకు పంపి, పనులు చేయించుకునేందుకు జెఫ్రీకి సహకరించారని ఐదు కేసుల్లో ఆమెను దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో ఆమెకు దాదాపు 65 ఏండ్ల పాటు జైలు శిక్ష పడనుంది. అయితే తక్కువ శిక్ష పడేందుకు ఈ కేసుకు సంబంధమున్న ప్రముఖుల పేర్లను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కాగా, 2019లో అరెస్టయిన జెఫ్రీ ఎప్స్టీన్.. అదే ఏడాది జైలులోని అనుమానాస్పదంగా మృతిచెందాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

