e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

మల్లాపూర్‌, ఏప్రిల్‌ 23 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేటర్‌ ప్రభుదాస్‌తో కలిసి మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ డివిజన్‌లోని ప్రధాన రహదారుల్లో ప్రభుత్వం అందించిన సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న టీకాలను తప్పకుండా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జి. శ్రీనివాస్‌రెడ్డి, గరిక సుధాకర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, బాలరాజు, నవీన్‌గౌడ్‌, సాయికుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

చెత్తలేని కాలనీలుగా తీర్చిదిద్దుదాం..

  • కాప్రా, ఏప్రిల్‌ 23: చెత్తలేని కాలనీలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు.
  • శుక్రవారం కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో మూడో విడతగా చెత్తను సేకరించే 15 కొత్త స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే బేతి, డీసీ శంకర్‌, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ మైత్రేయి, కార్పొరేటర్లు జెండా ఊపి ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెత్తను సేకరించి, తరలించే సందర్భంగా చెత్త కిందపడకుండా కొత్తగా రూపొందించిన స్వచ్ఛ ఆటోలు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
  • మూడు విడతలుగా ఇప్పటివరకు సర్కిల్‌కు 35 కొత్త స్వచ్ఛ ఆటోలు సమకూరాయన్నారు.
  • మరో 10 ఆటోలు కూడా రానున్నాయని, దీంతో మొత్తం 45 స్వచ్ఛ ఆటోలు ఇప్పటికే ఉన్న 98 పాత ఆటోలతో స్వచ్ఛ సర్వేక్షణ్‌కు వినియోగిస్తారన్నారు.
  • అన్ని కాలనీలను చెత్త రహిత కాలనీలుగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు.
  • డీసీ శంకర్‌ మాట్లాడుతూ.. సర్కిల్‌ పరిధిలో డస్ట్‌బిన్‌లు ఇక ఉండబోవని, చెత్తమొత్తం స్వచ్ఛ ఆటోల ద్వారానే తరలించాల్సి ఉంటుందని అన్నారు.
  • కాలనీలను పరిశుభ్రంగా, చెత్తరహితంగా ఉంచేందుకు కాలనీ వాసులు సహకరించాలని కోరారు.

పైవేటు ఉపాధ్యాయులకు అండగా టీఆర్‌ఎస్‌

  • మల్లాపూర్‌, ఏప్రిల్‌ 23 : కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 25 కిలోల బియ్యం, రూ. రెండువేలు ఆర్థిక సాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు.
  • శుక్రవారం ఆయన హెచ్‌బీకాలనీ డివిజన్‌ తిరుమలనగర్‌లోని రేషన్‌ షాపు ద్వారా స్థానిక కార్పొరేటర్‌ ప్రభుదాస్‌తో కలిసి ఉపాధ్యాయులకు 25 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేశారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి
కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి
కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement