Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్ బోర్డ్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. ఇది విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించేందుకు, పూర్వ విద్యార్థుల అనుభవాలను పంచుకునేందుకు ఉపయోగపడుతుంది.
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS) మూడు ప్రధాన డిజిటల్ ఫ్లాగ్‌షిప్‌లను నవంబర్ 13న ప్రారంభించారు. వీటిలో ఏఐ ఇంటిగ్రేటెడ్ విద్యా సమీక్ష కేంద్ర (VSK) విత్ ది సమీక్ష ఏఐ బాట్, KVS-సంవాద్ పేరెంట్ కనెక్ట్ యాప్, KVS ఆలుమ్ని కనెక్ట్ పోర్టల్ ఉన్నాయి. టెక్నాలజీ ఆధారిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన దిశగా కేంద్రీయ విద్యాలయాలు తమ పాఠశాలల నెట్‌వర్క్‌లోని విద్యార్థుల హాజరు, విద్యా పనితీరు, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.
విద్యార్థుల అభ్యసన ఫలితాలను పర్యవేక్షించి లోపాలను గుర్తించడంతో పాటు సకాలంలో స్పందించడానికి, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేందుకు, పూర్వ విద్యార్థుల అనుభవాలను వివరించి, మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ఈ డిజిటల్ పోర్టల్‌లు ఉపయోగపడతాయని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. విద్యావ్యవస్థను మరింత అనుసంధానంగా, ప్రతిస్పందించేది, ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేందుకు ప్రధాన ముందడుగుగా నిలుస్తాయి అని మంత్రి అన్నారు.
అన్ని తరగతులు, అన్ని ప్రాంతాలను కలుపుకొని ప్రతి కేంద్రీయ విద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని మంత్రి పిలుపునిచ్చారు. నిరంతర అభ్యసన విధానాన్ని అవలంబించాలని, ఫలితాలను అంచనా వేయాలని, మెరుగుపరచాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. టీచర్ల సామర్థ్యాన్ని, సమగ్ర శిక్షణ ఉపాధ్యాయ శిక్షణ సమాచారాన్ని పోర్టల్‌లో పొందుపరచాలని ఆదేశించారు. టీచర్ల శిక్షణ పనితీరు, గత శిక్షణ రికార్డులు, ఇంకా శిక్షణ అవసరాల వివరాలను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో పొందుపరచాలని తెలిపారు.
ఏఐ ఇంటిగ్రేటెడ్ విద్యా సమీక్ష కేంద్ర ద్వారా విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది హాజరు, అకడమిక్ పనితీరు, పాఠశాల మౌలికసదుపాయాలు, అడ్మిషన్ల గురించి సమాచారం తెలుసుకుంటుంది. ఈ సమాచారాన్ని విశ్లేషించి లోపాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. దీంతో సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
కేవీఎస్ సమ్వాద్ పేరెంట్ కనెక్ట్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, సిలబస్ పురోగతి, అకడమిక్ ఫలితాలు, అభ్యసన వనరులు, డిజిటల్ ఐడీ కార్డుల వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తారు. దీనిద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలలు చేరువ అవుతాయి. అలాగే వారు విద్యార్థులు, టీచర్ల దినచర్యలు తెలుసుకోవచ్చు. విద్యార్థుల బోనఫైడ్, CEA సర్టిఫికెట్, సెలవులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.కేవీఎస్ ఆలుమ్ని పోర్టల్ పూర్వ విద్యార్థులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల వారి విజయాలు, అనుభవాలను పంచుకోవడంతో పాటు మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్ అందిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

