Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతు నాయక్ అన్నారు.
అచ్చంపేట: వన్యప్రాణులను కాపాడుకోవడం (Wildlife Protect ) అందరి బాధ్యత అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతు ( Hanmanth Naik ) నాయక్ అన్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ, పర్యావరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వైల్డ్‌లైఫ్ అవేర్నెస్ ( Wildlife Awareness ) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల జీవన విధానం, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల సంరక్షణ, మానవ–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారణ వంటి అంశాలపై వివరించారు. ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని తెలిపారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో ప్రకృతిపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించాలని సూచించారు.
అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విద్యతో పాటు ఆరోగ్యం, పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతు నాయక్, అపోలో ఫౌండేషన్ వైద్య బృందం,పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

