టోక్యో: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో క్షణాల్లో ఇంటికే ఆహారం వచ్చి చేరుతున్నది. అయితే, భూమిపైనే కాదు రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ఆహారాన్ని డెలివరీ చేసింది ఉబెర్ ఈట్స్. జపాన్ పారిశ్రామిక వేత్త యుసాకు మెజావా డెలివరీబాయ్‌గా అవతారమెత్తి రుచికరమైన ఫుడ్‌ను వ్యోమగాములకు అందజేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.