Hyderabad | గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎంబీ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.
Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎంబీ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో వినోద్ అనే వ్యక్తి గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట వైపు బుల్లెట్ బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్‌పేట నుంచి గచ్చిబౌలి వైపు ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్లో స్కూటీపై శ్రీకాంత్, విఠల్ వచ్చారు. ఈ క్రమంలో స్కూటీ, బుల్లెట్ బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీకాంత్, విఠల్ ఇద్దరూ ఎగిరిపడ్డారు. వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో వారి తలలు రోడ్డుకు బలంగా తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

