Jagtial | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Jagtial | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు |

వెల్గటూరు : జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తల్లిదండ్రులతో పాటు మరో బాలుడు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. వెల్గటూరు మండలం కొత్తపేటకు చెందిన తిరుపతి (40) స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య మనోజ, కొడుకులు ఆదిత్య, కన్నయ్యతో పాటు కూతురు చిట్టీ ఉన్నారు. తిరుపతి భార్య మనోజ అత్త గత మూడు నెలల కిందట మృతి చెందింది. గురువారం మూడు నెలల మాసికం కార్యక్రమం ఉండడంతో కుటుంబంతో కలిసి తిరుపతి ద్విచక్ర వాహనంపై ధర్మపురి మండలం దమ్మన్నపేటకు వెళ్లాడు.
కార్యక్రమం అనంతరం తిరిగి భార్య, పిల్లలతో కలిసి తిరిగి కొత్తపేట వస్తుండగా.. పాశిగామ శివారులో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న వారంతా ఎగిరిపడ్డారు. వారిపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో శరీర భాగాలు తెగిపడ్డాయి. తీవ్ర గాయాలతో చిట్టీ, కన్నయ్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
తిరుపతితో పాటు భార్య, కుమారుడు ఆదిత్యకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు, తెగిపడ్డ శరీర భీతావహ దృశ్యాలు కనిపించాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

