Rare incident | ఆర్నెల్లలో రెండుసార్లు ప్రసవం.. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.!
Rare incident | మాతృత్వం అనేది ఓ మధురానుభూతి. ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. కానీ కొంత మంది దురదృష్టవంతులకు ఎన్నేండ్లయినా పిల్లలు కలుగరు. వారి సంగతి పక్కన పెడితే.. ఇప్పుడొక విచిత్ర విషయం గురించి తెలుసుకుందాం.. ఒకే మహిళ ఆర్నెల్ల తేడాతో ఇద్దరికి జన్మనిచ్చింది.
- అమెరికాలో అరుదైన సంఘటన
కాలిఫోర్నియా: మాతృత్వం అనేది ఓ మధురానుభూతి. ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. కానీ కొంత మంది దురదృష్టవంతులకు ఎన్నేండ్లయినా పిల్లలు కలుగరు. వారి సంగతి పక్కన పెడితే.. ఇప్పుడొక విచిత్ర విషయం గురించి తెలుసుకుందాం.. ఒకే మహిళ ఆర్నెల్ల తేడాతో ఇద్దరికి జన్మనిచ్చింది. వైద్యశాస్త్రంలో అత్యంత అరుదైన ఈ సంగతి ఎలా సాధ్యమైందో వైద్యులు వివరించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హెయిర్‌స్టయిలిస్ట్ జెస్సీకా ఆరు నెలల్లో రెండు సార్లు ప్రసవించింది. ఆమె ఇద్దరి సంతానంలో మొదటి సంతానం వయసు ఒక ఏడాది కాగా.. రెండో సంతానం వయసు ఆరు నెలలు. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దీనికి కారణమేంటో కూడా జెస్సికా వెల్లడించింది. దీన్ని వైద్య పరిభాషలో సూపర్ ఫెటేషన్ అంటారని తెలిపింది.
ఒకసారి గర్భం దాల్చిన మహిళ మళ్లీ గర్భవతి కావచ్చని పేర్కొన్నది. జెస్సికా విషయంలో ఇద్దరూ ఒకే గర్భాశయంలో వేర్వేరు సమయాల్లో జన్మించారు. అంటే ఒకే గర్భంలో రెండు పిండాలు ఉండి, ఆ రెండూ వేర్వేరు స్థాయిలో అభివృద్ధి చెంది ఉండొచ్చు. సూపర్ ఫెటల్ పిల్లలు టెక్నికల్‌గా ట్విన్స్ అనే చెప్పాలి. కానీ వారు పుట్టిన సమయాల్లో నెలల వ్యత్యాసం ఉంటుంది. ఇలా జరగటం చాలా అరుదు. ఇప్పటి వరకు అలాంటి కేసులు ఓ పది మాత్రమే రికార్డయ్యాయి. జెస్సికా కేసు 11వది. సాధారణంగా ఇలాంటి పిల్లల మధ్య వ్యత్యాసం కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. కానీ జెస్సికా విషయంలో ఈ తేడా ఆరు నెలలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- America
- births
- California
- Twins
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

