Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దీపావళి రాత్రి పెను విషాదం చోటుచేసుకున్నది. రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 12 మంది మృతిచెందారు. రెండు కుటుంబాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
భోపాల్: మధ్యప్రదేశ్లో దీపావళి రాత్రి పెను విషాదం చోటుచేసుకున్నది. రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 12 మంది మృతిచెందారు. రెండు కుటుంబాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కట్నీ, సియోని జిల్లాల్లో ఆదివారం రాత్రి ఈ ప్రమాదాలు జరిగాయి. కట్ని జిల్లాలోని బర్హి పట్టణంలో ఓ అగర్వాల్ కుటుంబానికి చెందిన ఆరుగురు అగ్నిప్రమాదానికి బలయ్యారు. మూడు అంతస్తుల భవనంలో కింద క్రాకర్ షాపు ఉన్నది. అయితే పైఅంతస్తులో ఓ కుటుంబం నివసిస్తోంది. రాత్రి ప్రమాదం జరగడంతో మంటలు పైకి వ్యాపించాయి. నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఆరుగురు కాలి బూడిదయ్యారు. మృతులను పూరన్ అగర్వాల్, చంద్రకళ, పూనమ్, ఆర్యా, అన్వీగా గుర్తించారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. తెల్లవారుజామున మృతదేహాలను వెలికితీశారు. షార్ట్ సర్క్యూట్ లేదా దీపాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇక సియోనీ జిల్లాలోని చాపారా పట్టణంలో మరో ప్రమాదం జరిగింది. ఓ నగల వ్యాపారి ఇంట్లో ప్రమాదం జరగడంతో ఆరుగురు మృతిచెందారు. మృతులను కుందన్ లాల్ సోనీ, రాజ్కుమారి సోనీ, రీతూ సోనీ, స్మృతి సోనీ, సూర్య సోనీ, ఆదిత్య సోనీగా గుర్తించారు. మరో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఇంట్లో పది మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉనప్పుడు ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రెండు ఘటనలు మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

