Health Tips | బాడీ పెయిన్స్, ఇన్ఫెక్షన్స్.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Health Tips | పసుపు..! పసుపునకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పసుపు ప్రాముఖ్యం గురించి పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపు సహజ ఔషధంలా పనిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గాయంపై చిటికెడు పసుపు వేస్తే సెప్టిక్ కాకుండా ఉంటుంది.
Health Tips : పసుపు..! పసుపునకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పసుపు ప్రాముఖ్యం గురించి పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపు సహజ ఔషధంలా పనిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గాయంపై చిటికెడు పసుపు వేస్తే సెప్టిక్ కాకుండా ఉంటుంది. గాయం త్వరగా మానిపోతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే సీజనల్ సమస్యలకు పసుపు చక్కని పరిష్కారం చూపుతుంది.
పసుపుతో ప్రయోజనాలు..
1. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ఇన్ఫ్లామెటరీగా పనిచేస్తుంది. ఈ కారకాలు మన శరీరంలో నొప్పి నివారణిలుగా పనిచేస్తాయి.
2. పసుపు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఎక్కువ శీతాకాలంలో వేధించే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నివారణలో మంచి ప్రయోజనకారిగా ఉంటుంది.
3. పసుపునకు వేడిని ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణం కణాల పనితీరును సక్రమంగా ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
4. కీళ్ల నొప్పులకు కూడా పసుపు ఔషధంలా పనిచేస్తుంది. టీ లేదా పాలలో ఒక చిటికెడు పసుపు వేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
5. పసుపులోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు విషాలను విచ్ఛిన్నం చేసే గుణం కలిగి ఉంటాయి. అందువల్ల పసుపు కాలేయాన్ని విషరహితం చేయడంలో తోడ్పడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

