e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News కరోనా ఎఫెక్ట్.. వాయిదా ప‌డ్డ ట‌క్ జ‌గ‌దీష్

కరోనా ఎఫెక్ట్.. వాయిదా ప‌డ్డ ట‌క్ జ‌గ‌దీష్

కరోనా ఎఫెక్ట్.. వాయిదా ప‌డ్డ ట‌క్ జ‌గ‌దీష్

క‌రోనా దెబ్బ‌కు మ‌ళ్లీ సినిమాలు వాయిదాల బాట ప‌డుతున్నాయి. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేప‌థ్యంలో జ‌నాలు థియేట‌ర్స్‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర నిర్మాత‌లు కూడా సినిమా రిలీజ్ విష‌యంలో కాస్త వెన‌కా ముందు ఆలోచిస్తున్నారు. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే ల‌వ్ స్టోరీ చిత్రం వాయిదా ప‌డ‌గా, చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య కూడా కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం ఏప్రిల్ 23న విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల‌న చిత్రాన్ని వాయిదా వేసామ‌ని నాని స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ట‌క్ జ‌గ‌దీష్ సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం. ఈ మూవీని అంద‌రు క‌లిసిక‌ట్టుగా చూడాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో అది సాధ్యం కాదు కాబ‌ట్టి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేస్తామ‌ని నాని అన్నారు. ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్క‌గా, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా ఎఫెక్ట్.. వాయిదా ప‌డ్డ ట‌క్ జ‌గ‌దీష్

ట్రెండింగ్‌

Advertisement