జూన్ 19 నుంచి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే 31:అప్పలాయగుంటలోనిశ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా జూన్ 15న ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. జూన్ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.జూన్ 22న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుంచి10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుంచి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

