Donald Trump | ‘నీకు పిచ్చి లేసిందా’.. ఫోన్లో ఇజ్రాయెల్ ప్రధానిపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
Donald Trump | ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య నిన్న జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్ (Labenon) లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు.. ఇరాన్ (Iran) తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.
Donald Trump : ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య నిన్న జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్ (Labenon) లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు.. ఇరాన్ (Iran) తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత కఠినమైన, ఘాటైన పదజాలం ఉపయోగించారని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ సంభాషణ ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది.
నెతన్యాహుపై తన అసహనాన్ని ట్రంప్ దాచుకోలేకపోయారు. ‘నీకు పిచ్చి పట్టిందా..? నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ఇప్పుడు నీ వల్ల ఇజ్రాయెల్‌ను కూడా అందరూ ద్వేషిస్తున్నారు’ అని ట్రంప్ అన్నట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ‘అసలు ఏం చేస్తున్నావ్ నువ్వు..?’ అంటూ నెతన్యాహుపై ట్రంప్ గట్టిగా అరిచినట్టు ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ చర్యలు ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తాయని, దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీస్తాయని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించినట్లు సమాచారం.
లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడం, ముఖ్యంగా బీరూట్ శివార్లలోకి సైనిక చర్యలు విస్తరించేందుకు సిద్ధమవ్వడంతో ఈ వివాదం ముదిరింది. ఇజ్రాయెల్ చర్యలను కారణంగా చూపుతూ అమెరికాతో పరోక్ష చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో ఒక ప్రాథమిక ఒప్పందం ద్వారా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించాలని భావిస్తున్న ట్రంప్.. నెతన్యాహు చర్యలను తన ప్రయత్నాలకు గండికొట్టేవిగా పరిగణించి ఆగ్రహం వెల్లగక్కారు.
కాగా, నెతన్యాహుకు తన ఫోన్ కాల్ తర్వాత బీరూట్ వైపు వెళ్లే ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయని, దాడులు ఆపేందుకు హెజ్బుల్లా అంగీకరించిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. అయితే నెతన్యాహు మాత్రం ఈ సంభాషణను భిన్నంగా వెల్లడించారు. హెజ్బుల్లా కాల్పుల విరమణ పాటించకపోతే బీరూట్‌పై దాడి చేస్తామని తాను ట్రంప్‌ను హెచ్చరించినట్టు తెలిపారు. బీరూట్‌పై దాడుల ప్రణాళికను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని చెప్పారు. అయినప్పటికీ తమ పౌరులపై దాడులు కొనసాగితే లెబనాన్‌లో సైనిక చర్యలు యథావిధిగా కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

