ధరల పెరుగుదలను నిరసిస్తూ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు. ద్రవ్యోల్బణం పెరగడంతో నేపథ్యంలో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతోంది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శించి, మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేశవరావు, నామానాగేశ్వరరావు, సంతోష్, దివకొండ దామోదర్‌రావులతో పాటు ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ధరల పెరుగుదల అంశంపై అంతకుముందు ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. రెండు సభలూ మద్యాహ్నం 2 వరకు వాయిదాపడ్డాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

