హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 68 మంది ఎక్సైజ్ ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 13 మంది డిప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది ఎక్సైజ్ సూపరింటెండెట్లను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరికిషన్ సైబరాబాద్ డీసీగా బదిలీ అయ్యారు. బ్రూవరేజస్ ఏసీగా పనిచేస్తున్న చంద్రయ్య ఉద్యోగోన్నతి మీద ఉమ్మడి మెదక్ జిల్లా డీసీగా నియమితులయ్యారు. నల్లగొండ డీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ డీసీగా బదిలీ అయ్యారు.
రంగారెడ్డి డీసీగా ఉన్న దశరథ టీజీబీసీఎల్ డీసీగా, ఖమ్మం డీసీగా ఉన్న జనార్దన్‌రెడ్డి ఆదిలాబాద్ డీసీగా బదిలీ అయ్యారు. టీజీబీసీఎల్ ఆర్ఆర్-1లో ఉన్న దాతురాజు గౌడ్ వరంగల్ డీసీగా, నిజామాబాద్ ఏసీగా ఉన్న సోమిరెడ్డి ఖమ్మం డీసీగా, కరీంనగర్ బీసీఎల్ మేనేజర్‌గా ఉన్న రవికుమార్‌ను కరీంనగర్ డీసీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేబుల్స్‌లో పనిచేస్తున్న శ్రీధర్ నిజామాబాద్ డీసీగా, హెడ్ క్వార్టర్స్‌లో డీసీగా ఉన్న రఘురాం రంగారెడ్డి డీసీగా, హైదరాబాద్ ఏసీగా ఉన్న అనిల్‌కుమార్ రెడ్డి ఈస్ట్ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. స్పెషల్ టాస్ఫోర్స్లో ఏసీగా ఉన్న ప్రణవి మలాజిగిరి డీసీగా, విజయభాస్కర్‌రెడ్డి మహబూబ్‌నగర్ డీసీగా నియమితులయ్యారు.