ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారి వల్లే నీట్ లీకేజీ
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
- లీకేజీపై కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరం : మహేశ్‌కుమార్‌గౌడ్
హిమాయత్‌నగర్,జూన్25: ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నారాయణగూడలో నీట్‌పై ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటే.. పేపర్ లీకేజీల వల్ల వారి శ్రమ వృథా అవుతుందని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. విద్యావ్యవస్థలో పారదర్శకతను పాటిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

