Search list-2021 | ఈ ఏడాదిలో ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ టెన్ బైక్స్ ఇవే..!

హైదరాబాద్ : కరోనా కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత భారత మార్కెట్లో కి పలురకాల కొత్త మోటార్ బైకులు వచ్చాయి. అటువంటి వాటిలో కొన్ని అప్డేటెడ్ బైక్స్ కాగా, మరికొన్ని కొత్త మోడల్స్.. ఇండియా మార్కెట్ లోకి వచ్చిన న్యూ బైక్స్ గురించి తెలుసుకోవడానికి కొందరు, కొనుగోలు చేయడానికి మరికొందరు గూగుల్ ల్లో సెర్చ్ చేశారు. అవేంటంటే..?
- రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350:ఈ ఏడాదిలో ఎక్కువ మంది గూగుల్ సెర్చ్‌లో వెతికిన టాప్ 10 బైక్స్ లో “రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ -350” మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో గూగుల్‌లో ప్రతి నెల 8 లక్షల సార్లు సెర్చ్ చేశారట.

2.యమహా ఎమ్‌టి-15 (Yamaha MT-15):2021లో గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేసిన రెండో బైక్ యమహా ఎమ్‌టి-15. ఈ బైక్ ను ప్రతి నెల 5.5 లక్షల సార్లు సెర్చ్ చేసారు.
3.కేటీఎమ్ ఆర్సీ 200 (KTM RC 200): దేశీయ మార్కెట్లో ఎక్కువమంది బైక్ రైడర్స్ ఇష్టపడే బైక్స్ లో ఇది ముందువరుసలో నిలిచింది.కేటీఎమ్ కంపెనీ ఆర్సి 200 బైక్ 2021లో అత్యధికంగా శోధించిన బైకుల జాబితాలో టాప్ 10 లో మూడో బైక్ గా నిలిచింది. ఈ బైక్ గూగుల్‌లో ప్రతి నెలా 4.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు నెటిజన్స్.
4.బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125):బజాజ్ ఆటో సంస్థకు చెందిన బజాజ్ పల్సర్ 125 బైక్ గూగుల్‌లో ఎక్కువగా వెతికిన బైక్స్ లో ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. బజాజ్ పల్సర్ 125 బైక్ ను ప్రజలు గూగుల్‌లో 3.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు.
5.యమహా ఆర్15 (Yamaha R15): ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ లో వెతికిన టాప్ టెన్ బైకులతో జాబితాలో యమహా ఆర్-15కు ఐదోస్థానం దక్కింది.
6.రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan):
మార్కెట్లో అత్యంతగా ఆదరణపొందిన టూవీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కు చెందిన ‘రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఆరో స్థానంలో నిలిచింది.
7.కేటీఎమ్ ఆర్సీ390 (KTM RC390): కేటీఎమ్ ఆర్సీ 390 బైక్ ను గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా సర్చ్ చేశారు. ఇది ఏడో స్థానంలో ఉన్నది.
8.సుజుకి హయబుసా (Suzuki Hayabusa): నివేదిక ప్రకారం ఈ బైక్ ను ప్రతి నెల దాదాపు 3 లక్షల సార్లు సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సుజుకి మోటార్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ బైక్ “సుజికి హయబుసా” కు 2021లో గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కింది. ఇది దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న కాస్ట్లీ బైక్ కూడా. ఈ బైక్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
9.హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus): ఇది అత్యంతగా అమ్ముడైన ఉత్తమ బైక్ గా నిలిచింది. అత్యంత ఆదరణ కలిగిన వెహికల్ గా, ముందువరుసలో స్థానం సంపాదించగలిగింది. ఈ ఏడాది అత్యధికంగా శోధించిన టాప్ టెన్ బైక్స్ జాబితాలో దీనికి తొమ్మిదో స్థానం దక్కింది.
10.రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350 (Royal Enfield Meteor 350): 2021 సంవత్సరంలో టాప్ టెన్ లిస్ట్ లో” రాయల్ ఎన్ఫీల్డ్ “కు చెందిన బైక్స్ మూడు ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350ను ఎక్కువగా యూత్ కోరుకున్నారు. గూగుల్ లో వెతికిన టాప్ టెన్ జాబితాలో ఈ బైక్ పదో స్థానంలో నిలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

