Chicken Fry | ఓ వివాహ (UP wedding) వేడుకలో చికెన్ ఫ్రై (Chicken Fry) చిచ్చుపెట్టింది. రుచికరమైన పదార్థాన్ని తగినంతగా వడ్డించలేదంటూ వరుడి తరఫున బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇది కాస్తా చివరికి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బిజ్నోర్ (Bijnor) జిల్లాలో చోటు చేసుకుంది.
నిఖా సమయంలో వధువు తరఫువారు బంధువులకు రుచికరమైన వంటకాలను వడ్డించారు. అయితే, వరుడి బంధువులు మాత్రం తమకు చికెన్ ఫ్రై తక్కువగా వడ్డిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో వారిని శాంతింపజేసేందుకు వధువు కుటుంబం వారికి ఎక్కువ చికెన్ ఫ్రై ముక్కలు తెచ్చి వడ్డించింది. అయితే, వారు మర్యాదగా వడ్డించడంలేదంటూ మరో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది. వధువు, వరుడి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపుచేశారు. ఇరు కుటుంబాలను శాంతింపజేసి.. కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిపించారు. మరోవైపు ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా పూర్ కేటగిరీలోనే వాయు కాలుష్యం
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన