టాలీవుడ్లో పెండ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అక్కినేని సమంత. సినిమా సినిమాకు కొత్త కొత్త పాత్రలు చేస్తూ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోంది. ఇపుడు గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం ప్రాజెక్టులో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయింది. దీంతోపాటు నందినీరెడ్డి డైరెక్షన్లో సమంత ఓ సినిమా చేయనుండగా..త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. సమంత రెమ్యునరేషన్ టాపిక్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ప్రస్తుతం సామ్ తన సినిమాలకు రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సామ్ రెమ్యునరేషన్ పెంచడం పెద్ద విషయమేం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.