ఆధ్యాత్మిక వైభవం
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దీపం పెట్టే నాథుడు లేక వెలవెలబోయిన ఆలయాలకు స్వరాష్ట్రంలోనే మంచిరోజులు వచ్చాయి. వేలాది కోట్ల రూపాయలతో గుడుల పునరుద్ధరణ చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అర్చకులకు సైతం తగిన వేతనం ఇస్తూ వారి గౌరవాన్ని పెంచింది.
- కురవి, ఐనవోలు ఆలయాలకు కొత్తశోభ
- భద్రకాళి ఆలయానికి మాడవీధులు
- రూ. 334 కోట్లతో మేడారంలో వసతులు
- ముస్లిం, క్రిస్టియన్ పండుగలకూ ప్రాధాన్యం
- నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
వరంగల్, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దీపం పెట్టే నాథుడు లేక వెలవెలబోయిన ఆలయాలకు స్వరాష్ట్రంలోనే మంచిరోజులు వచ్చాయి. వేలాది కోట్ల రూపాయలతో గుడుల పునరుద్ధరణ చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అర్చకులకు సైతం తగిన వేతనం ఇస్తూ వారి గౌరవాన్ని పెంచింది. ఉమ్మడి జిల్లాలో 442 ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులిస్తున్నది. చర్చిలు, మసీదులనూ సరికొత్తగా తీర్చిదిద్ది సర్వమతాలను ఆదరిస్తున్నది. మేడారం మహాజాతర కోసం రూ.334 కోట్లు కేటాయించి వసతులు కల్పించింది. కురవి, ఐనవోలు ఆలయాలకు మెరుగులు దిద్దడంతో పాటు వరంగల్ భద్రకాళి గుడికి రూ.30కోట్లతో మాడవీధులు కట్టిస్తున్నది.
‘మన నిధులు మనకే’నన్న నినాదంతో ఏర్పాటైన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు పూర్వవైభవం తెచ్చి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చేసింది. ఉమ్మడి జిల్లాలోని ఆలయాలను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. మసీదులు, చర్చిలకు సైతం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ కొత్తగా తీర్చిదిద్దుతున్నది. తెలంగాణ ప్రభుత్వ విశేష కృషితో ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వెయ్యికి పైగా ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని 11 కిలోల 650 గ్రాముల బంగారంతో చేయించిన కిరీటాన్ని అమ్మవారికి మొక్కుగా చెల్లించారు.
భద్రకాళీ ఆలయం చుట్టూ మాడవీధులకు ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది. అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఉత్సవం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఇప్పటి వరకు రూ.334 కోట్లతో వసతులు కల్పించింది. కాళేళ్వరం ఆలయానికి రూ.25 కోట్లు, కురవి ఆలయానికి రూ.5 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నది. రూ.2 కోట్లతో ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు చేసింది. సాధారణ నిధులతోపాటు ప్రత్యేక అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోట్ల రూపాయలను ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. అలయాల అభివృద్ధితోపాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జాతరలు, పండుగలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నది.
అర్చకులకు జీఐఏ ద్వారా వేతనాలు
ఉమ్మడి రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఏ, బీ గ్రేడ్ పరిధిలోని ఆలయాల అర్చకులకు మాత్రమే ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించేవారు. చిన్న దేవాలయాల్లో పనిచేసేవారు నెలల తరబడి వేతనాలు లేక ఇబ్బందులు పడేవారు. భక్తులు వేసే హుండీ కానుకలతో వేతనాలు తీసుకునే పరిస్థితి ఉండేది. ఆదాయం లేని ఆలయాల అర్చకులు వేతనాలు లేకుండానే స్వామి సేవ చేసుకునేవారు. తెలంగాణలో అర్చకుల కష్టాలు తీరిపోయాయి. సీఎం కేసీఆర్ అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ప్రతి నెలా వేతనాలు అందిస్తున్నారు.
442 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం
ఆదాయం లేని ఆలయాలను సమైక్య ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనీసం దేవుడికి దీపం వెలిగించేందుకు నిధులు కుడా మంజూరు చేయలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 442 ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. దీని కింద ఇచ్చే మొత్తాన్ని సీఎం కేసీఆర్ రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.
మేడారం ఉత్సవం
సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే జాతరను వైభవంగా నిర్వహిస్తున్నది. కోట్లాది మంది వచ్చే ఈ జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.334 కోట్లతో ఏర్పాట్లు చేసింది. హరిత హోటల్‌తో పాటు కాటేజీలను నిర్మించింది. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన చేసిన అభివృద్ధితో ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తల్లుల దర్శనానికి తరలివస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

