ఎలిజబెత్ రాణికి వినూత్న స్వాగతం పలికి చరిత్రసృష్టించిన వెయ్యి మంది మహిళలు.. ఇంతకీ ఏం చేశారంటే..
The Royal Ascot | ఇంగ్లాండ్‌లో రాయల్ యాస్కాట్ వేదికగా గురువారం జరిగిన ‘లేడీస్ డే ( Ladies Day )’ వేడుకల్లో వేయిమంది మహిళలు చీరలు కట్టి చరిత్ర సృష్టించారు. వీరిలో భారత సంతతివారే అధికం. ఇందులో బెంగాల్ ‘కాంతా’ ఎంబ్రాయిడరీ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాధారణంగా ఇలాంటి వేడుకల్లో సూట్లు, హ్యాట్లు ధరించినవారే ఎక్కువ. యునైటెడ్ కింగ్ డమ్‌లో డాక్టర్‌గా పనిచేసే దీప్తి జైన్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. భారతీయ చేనేతల గొప్పతనాన్ని రాణి ముందు ప్రదర్శించాలని భావించారు. తన చీరమీద లండన్, కోల్‌కతా నగరాల విశేషాలు, ఎలిజబెత్ రాణి ముఖం, బిగ్ బెన్ గడియారం, లండన్ టవర్‌ను ఎంబ్రాయిడరీ చేయించారు. ఈ చిత్రాలను చీరపై తీర్చిదిద్దిన కళాకారిణి పేరు.. రూపా ఖాటూన్. పశ్చిమ బెంగాల్‌లోని నానూర్కు చెందిన రూపకు ఎలిజబెత్ రాణి గురించి ఏ మాత్రం తెలియదు.“ఈ చీరలు నేయడం మా అమ్మ, అమ్మమ్మ నుంచి నేర్చుకున్నాను. నేను ఎంబ్రాయిడరీ చేసిన చీరను రాణిగారి ముందు ప్రదర్శించడం మాత్రం చాలా గర్వంగా అనిపిస్తున్నది” అంటారు రూపా ఖాటూన్.
Read More :
అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆపదలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న తెలంగాణ బిడ్డ”
“అనుమానాలను పటాపంచలు చేసి గిరిజనులకు అండగా మారిన డాక్టర్.. ఇంతకీ ఆయన ఏం చేశాడు?”
“ఆన్లైన్లో ఆర్డరిస్తే డ్రెస్ కుట్టి ఇంటికే పంపిస్తరు.. హైదరాబాదీ మహిళ ఐడియా అదుర్స్”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bengal
- Queen Elizabeth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

