Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Thiruveer | టాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, కేవలం తన అంకితభావం మరియు సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో తిరువీర్ ఒకడు.
Thiruveer | టాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, కేవలం తన అంకితభావం మరియు సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో తిరువీర్ ఒకడు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఇటు వైవిధ్యమైన పాత్రలతో, అటు బలమైన కథా చిత్రాలతో హీరోగా ఎదిగిన ఆయన ప్రయాణం నేటి యువతకు ఎందరికో స్ఫూర్తిదాయకం. ‘మసూదా’, ‘పరేషాన్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఇప్పుడు మరో ఇంటెన్సివ్ మరియు పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’. ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు రిషి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
రూరల్ అండ్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే రాజకీయ పరిణామాలు, వ్యవస్థలోని లోపాలు, ఆ వాతావరణంలో పుట్టుకొచ్చే రొమాంటిక్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమా కథాంశానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. సమాజంలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఒక సామాన్య యువకుడు చేసే పోరాటం, అతని చుట్టూ తిరిగే పీరియడ్ పాలిటిక్స్, మరియు ఉద్వేగభరితమైన ప్రేమకథ ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, బలమైన భావోద్వేగాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లనుంది. ఇక ఈ సినిమా తిరువీర్ కెరీర్లో నిలిచిపోయో చిత్రంగా ఉండబోతున్నట్లు సమాచారం.
రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ద్వారా జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతూ కథ, స్క్రీన్ ప్లే, మాటలను కూడా అందించారు.
ఇటీవలే సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించబోతుంది. ఈ చిత్రంలో వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ, అధిరే అభి, బలగం సంజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేశారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించగా, కె.పి. (S. Krishna Prasaad) సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరువీర్ మరోసారి తన మార్క్ నటనతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తారోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

