Books | పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్లకు ఇవి చాలా ప్రత్యేకం!!
Books | పుస్తకం టెక్నాలజీకి అనుసంధానమైంది. విక్రయాలే కాదు పఠనం, సమీక్ష, సిఫారసు.. అన్నీ ఆన్లైన్ వేదికగా సాగుతున్నాయి. అయితే.. ఇంటర్నెట్లో నచ్చిన పుస్తకాల అన్వేషణ అంత సులభం కాదు. ఇక లైబ్రరీకి వెళ్లామా.. నడిసంద్రంలో నావ ప్రయాణమే! కొన్ని వేదికలు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి.
Books | పుస్తకం టెక్నాలజీకి అనుసంధానమైంది. విక్రయాలే కాదు పఠనం, సమీక్ష, సిఫారసు.. అన్నీ ఆన్లైన్ వేదికగా సాగుతున్నాయి. అయితే.. ఇంటర్నెట్లో నచ్చిన పుస్తకాల అన్వేషణ అంత సులభం కాదు. ఇక లైబ్రరీకి వెళ్లామా.. నడిసంద్రంలో నావ ప్రయాణమే! కొన్ని వేదికలు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి.

అమెజాన్.. పుస్తకాల కోసమే ఓ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌గా ప్రారంభించారు జెఫ్ బెజోస్ . ఆ తర్వాత ఇతర విభాగాలకూ విస్తరించింది. కానీ తన మూలాల్ని మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు. ఇప్పటికీ అత్యుత్తమ, సమకాలీన ఆంగ్ల సాహిత్యం ఇక్కడే దొరుకుతుంది. దీనికి కారణం.. బెజోస్‌కు వ్యాపారంపైనే కాదు, పుస్తకాల ఇతివృత్తం పైనా అవగాహన ఉంది. పుస్తకాలు ఎలా ప్రచురితం అవుతాయి, మార్కెటింగ్ ఎలా చేస్తారు, కొనుగోలు విధానం ఏంటి.. తదితర విషయాలను గత ముప్పయి ఏండ్లుగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నది అమెజాన్. ఈ సంస్థ స్టార్ రేటింగ్ ఇచ్చిందంటే మంచి పుస్తకం కిందే లెక్క. ధర, పేజీలు, పబ్లిషర్ వివరాలతోపాటు సమీక్షలనూ ప్రచురిస్తుంది.

టెర్టూలియా..
అమెజాన్‌కు తమ్ముడి లాంటి స్టార్టప్. ఇది సాహిత్య గ్రంథాల వేదిక. లాటిన్ అమెరికాలో చాలా ఫేమస్. సాహిత్య అభిమానులను, రచయితలను ఏకం చేస్తున్న సంస్థ. అమెరికాలో ఎక్కువగా వాడతారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, పోడ్కాస్ట్ల ద్వారా చర్చలు నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో ఇ-బుక్స్, ఆడియోబుక్స్ విక్రయించాలని కంపెనీ ప్రణాళిక వేస్తున్నది. మన దగ్గర దీని సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ‘భారతదేశం మా తొలి ప్రాధాన్యం. ఇక్కడ మంచి రచయితలకు, తాజా కంటెంట్‌కూ కొదవ లేదు. అక్షరాలను ప్రేమించే పాఠకులు లక్షలాదిమంది’ అంటారు టెర్టులియా నిర్వాహకులు.

లిట్సీ..
లిట్సీ కూడా ఈ కోవలోకే వస్తుంది. 2016 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. రచయితలు, పాఠకులు, లైబ్రరీల నిర్వాహకులు, ప్రచురణకర్తలు దీనితో అనుసంధానమై ఉంటారు. ఇక్కడ పుస్తకాల్ని షేర్ చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. స్టోరీగ్రాఫ్ అనే రీడింగ్ ట్రాకర్‌ను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. చాంతాడంత సమీక్షలు చదవకుండానే.. ఆ గ్రాఫ్‌ల సాయంతో పాఠకాదరణను అర్థం చేసుకోవచ్చు. ‘బ్లిన్కిస్ట్’.. జర్మన్ పుస్తకాల అన్వేషణకు ఉపయోగపడుతుంది. షెల్ఫ్సేవీ, లిటిన్ ఇన్ఫినిట్, పేజ్ అండ్ పెయిరింగ్ కూడా కాస్త తేడాతో ఇలాంటి సేవలనే అందిస్తాయి. పుస్తక దుకాణంలో, లైబ్రరీలో జల్లెడ పట్టి గంటల కొద్దీ సమయాన్ని వృథా చేసుకునేంత తీరిక, ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు. ఇదంతా మనసుకు ఒత్తిడి కలిగించే వ్యవహారం కూడా. ఆ శోధనలో సాయపడతాయి ఈ వేదికలు. ఇంకా చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే.. గూగులమ్మ ముద్దుబిడ్డ గూగుల్ బుక్స్‌ను విస్మరించలేం. ఓపెన్ లైబ్రరీలాంటి సమష్టి ప్రయత్నాలూ గొప్పగానే జరుగుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో మాత్రం ఈ తరహా ప్రయోగాలు పెద్దగా జరగడం లేదు. ఆ మాటకొస్తే పుస్తకాన్ని ముద్రించుకోవడమే ఓ మహాయజ్ఞంగా మారింది. కొనేవాళ్లు తగ్గారు. ప్రచురణ వ్యయం ఎక్కువైపోయింది. కేరళలాంటి చోట్ల రచయితలు బృందాలుగా ఏర్పడి సహకార పద్ధతిలో పుస్తక ముద్రణలు చేపడుతున్నారు. పాత పుస్తకాలను బతికించుకోవాలి, కొత్త పుస్తకాలకు జన్మనివ్వాలి, రచయితకు ఉపాధి కల్పించాలి, ప్రచురణ కర్తలకు ఎంతోకొంత గిట్టుబాటు కావాలి.. ఇవన్నీ జరగాలంటే పుస్తక పఠనం హఠాన్మరణానికి గురి కాకూడదు.
గుడ్‌రీడ్స్
పుస్తకావిష్కరణ ప్లాట్‌ఫామ్స్‌లో మరో సంచలనం.. బుక్ఫినిటీ. పుస్తకంపై ఉన్న కవర్‌ను బట్టి ఆ పుస్తకం ఎలా ఉందో చెప్పే టూల్‌నూ అందిస్తుంది. మన అభిరుచిని, జానర్‌ను చెబితే చాలు, అదే మనకు నచ్చే రచనలు సిఫారసు చేస్తుంది. పుస్తకలోకం పట్ల మన పరిజ్ఞానాన్ని పరీక్షించుకోడానికి క్విజ్లు నిర్వహిస్తుంది. ఆన్లైన్లో ఉన్న సమస్య ఏమిటంటే.. మన ఆసక్తులు నమోదు చేయగానే.. కృత్రిమ మేధ సాయంతో.. మన వాల్ మీద అదే తరహా ప్రకటనలు హోరెత్తుతాయి. కాకపోతే, ‘మీ అనుమతి లేకుండా మీ వివరాలు పంచుకోం’ అని హామీ ఇస్తుంది బుక్ఫినిటీ. ఇలాంటి మరో యాప్ కూపర్. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని పుస్తకాలను కనుగొనడానికి కూడా ఈ యాప్ సాయపడుతుంది. ‘గుడ్‌రీడ్స్’ ఈ జాబితాలో చాలా పాతది. ఇది అమెరికన్ సోషల్ కేటలాగింగ్ వెబ్సైట్. ఎప్పుడో, అమెజాన్ అనుబంధ సంస్థగా మారిపోయింది కూడా. డేటాబేస్ పుస్తకాలు, ఉల్లేఖనాలు, కోట్లు, సమీక్షలను శోధించడానికి అనుమతిస్తుంది. లైబ్రరీ కేటలాగ్లు రూపొందించడానికి దీనిలో పేరు నమోదు చేసుకోవచ్చు. నిజానికి ఇదో సువిశాలమైన ప్రపంచం. తవ్వినకొద్దీ ఊటే, వెదికిన కొద్దీ అక్షరాలే.
Read More :
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Book review
- books
- Reading
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

