అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ గేమ్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’. ఈ రియాలిటీ షోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగులోకి తీసుకొస్తున్నది. ఇన్నాళ్లూ వెండితెరపై సూపర్ హీరోగా సత్తా చాటిన తేజ సజ్జా ఈ రియాలిటీ గేమ్ షో ద్వారా వ్యాఖ్యాతగా అవతరించనున్నారు.
చిన్మయి శ్రీపాద, హర్షవర్దన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర, సింహా.. ఇలా వివిధ రంగాలకు చెందిన 20మంది ప్రముఖులు గేమ్ షోలో పాల్గొంటారు. అత్యంత ఉద్వేగభరితమైన ఈ గేమ్ షో నాలుగు వారాలపాటు పది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానున్నదని, అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది.
‘ది ట్రయిటర్స్’తో ఎక్సైట్మ్ంట్, థ్రిల్ల్ని తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావడం ఆనందంగా ఉంది. అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించిన పెద్ద హిట్ షో ఇది. దీని తెలుగు వెర్షన్ హోస్ట్‌గా నేను వ్యవహరించడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఈ గేమ్ షోలో మనదైన వ్యక్తిత్వం, మనదైన ఫ్లేవర్‌ను మిక్స్ చేసి ఆసక్తిగా ఈ గేమ్ షోను తీర్చిదిద్దుతున్నాం’ అని తేజా సజ్జా తెలిపారు.