T-Flight | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హైస్పీడ్ ట్రైన్స్‌కు పెట్టింది పేరైన చైనాలో ఇప్పుడు మరో అత్యాధునిక, సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్‌ను అభివృద్ధి చేశారు పరిశోధకులు. ఆకృతిలో రైలును పోలి, వేగంలో విమానానికి తీసిపోని ఈ ట్రైన్‌కు ‘టీ-ఫ్లైట్’గా నామకరణం చేశారు. దీనికి చక్రాలు ఉండవు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో లక్షిత వేగాన్ని రైలు సులభంగా అందుకోగలదు.