థేమ్స్ నదిలోకి కొట్టుకొచ్చిన బుజ్జి తిమింగలం కథ విషాదాంతం

లండన్: అదో తిమింగలం పిల్ల. ఎటో వెళ్లాలనుకుని ఇంకెటో వెళలిపోయింది. లండన్ నగరం మధ్య నుంచి ప్రవహించే థేమ్స్ నదిలోకి కొట్టుకు వచ్చింది. జనం జాతర కట్టారు. జంతు ప్రేమికులు, పశువైద్యులు దానిని కాపాడేందుకు మింక్ జాతికి చెందిన ఆ తిమింగలం తినే తిండి థేమ్స్ నదిలో దొరకదు. తిరిగి సముద్రంలోకి చేర్చాలన్నా అయ్యే పని కాదు. థేమ్స్ నదిలో ఒడ్డుకు దగ్గరగా వచ్చి మేటవేసిన చోట బురదలో చిక్కుకుపోయింది. దానిని కాపాడేందుకు ఇంక వేరే మార్గమేదీ కనిపించలేదు. తీవ్ర అస్వస్థతతో అలమటిస్తున్న తిమింగలం పిల్లను చివరకు చేసేదేమీ లేక విషపు ఇంజక్షన్ ఇచ్చి బాధల నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించారు. ముందుగా అది ఆదివారం నాడు రిచ్మాండ్ లాక్స్ వద్ద ఇరుక్కుపోయి కనిపించింది. అతికష్టం మీద విడిపించగలిగారు. గాలినింపే పడవ మీద దానిని పడుకోబెట్టారు. కానీ అది తప్పించుకుని పోయింది. సోమవారం ఉదయం టెడ్డింగ్టన్ వద్ద కనిపించింది. తీగల్లో చిక్కుకపోయి కదల్లేని స్థితిలో ఉంది. అప్పటికే గాయాలతో అది తీవ్రమైన బాధలో ఉంది. కదలడం మానేసింది. సోమవారం సాయంత్రం పశువైద్యులు ఇచ్చిన ఇంజక్షన్‌తో అది శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఈదురుగాలులు వీస్తున్నా, వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రెయిలింగ్స్ పట్టుకుని చూస్తుండిపోయిన జనం బరువెక్కిన గుండెలతో నిట్టూర్పులు విడుస్తూ తమతమ ఇళ్లకు మళ్లారు. గత మార్చిలో ఒక సీల్ ఇదే తరహాలో థేమ్స్ లోకి వచ్చింది. వీధికుక్కలు దానిని పీకిపెట్టాయి. అప్పుడు కూడా పశువైద్యుల ఇంజక్షన్ ఉపయోగించాల్సి వచ్చింది. లాక్డౌన్ వల్ల బోట్లు తిరగకపోవడమే ఇలా సముద్ర జీవులు నదుల్లోకి కొట్టుకురావడానికి కారణమని అంటున్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Calf
- london
- Mink Whale
- Put down
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

