ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ( MLAs) , కలెక్టర్ల ( Collectors) సమావేశంలో అధికారులు వ్యవహరించిన తీరుపై మహిళా ఎమ్మెల్యే (Women MLA ) ఇబ్బంది పడ్డారు. దీంతో అసహనానికి గురైన ఆమె వేదిక నుంచి దిగి అధికారుల పక్కన కూర్చున్నారు. గురువారం ఆదిలాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్( Adilabad) జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖ పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వేదికపైన కూర్చున్నారు. అదే సమయంలో సమావేశానికి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ( Kova Laxmi ) కి వేదిక చివరన కూర్చున్నారు.
అధికారుల రాకపోకలతో ఆమె ఇబ్బంది పడి కిందకు వచ్చి అధికారుల పక్కన కూర్చున్నారు. గమనించిన బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ వేదిక దిగివచ్చి తన కుర్చీలో కూర్చోవలసిందిగా సూచించారు. సహచర ఎమ్మెల్యే సూచనల మేరకు కోవలక్ష్మి తిరిగి వేదికపై వెళ్లి కూర్చున్నారు.