న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. సీబీఆర్ 650ఆర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది సంస్థ. ఈ బైకు ధర రూ.9.35 లక్షలు. నూతన సంవత్సరంలో విడుదలచేసిన తొలి బైకు ఇదేనని, సీకేడీ రూట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ బైకు కావాలంటే బింగ్వింగ్ టాప్‌లైన్ షోరూంలలో మాత్రమే ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, ముంబైలలో షోరూంలు ఉన్నాయి.