బ్యాంకుల్లో ఒక నిర్ణీత కాలంలో నిర్దేశిత వడ్డీరేటుపై పెట్టుబడి చేసే అవకాశం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)తో లభిస్తుంది. ఎఫ్డీ కాలపరిమితి ముగిసిన తర్వాత అసలు+వడ్డీ చేతికి అందుతుంది. ఇతర పెట్టుబడి సాధనాల్లో రిస్క్ తీసుకోదల్చనివారికి ఎఫ్‌డీల్లో మదుపే మంచి పొదుపు మంత్రం. వివిధ కాలపరిమితులతో బ్యాంక్‌లు అందించే ఎఫ్డీలకు వేర్వేరు బ్యాంకుల్లో వడ్డీరేట్లు భిన్నంగా ఉంటాయి. మీ సౌలభ్యం, మీరు వేచిఉండే కాలం, మీ నమ్మకాలకు అనుగుణంగా బ్యాంక్‌ను, ఎఫ్డీని ఎంచుకోవచ్చు. మీరు ఎఫ్డీ చేసే కాలపరిమితిని బట్టి కూడా వడ్డీ రేట్లు మారతాయి. అలాగే వీటిపై వడ్డీ మీరు కోరుకున్నవిధంగా కాలపరిమితి ముగిసిన తర్వాత లేదా, నెలకు, మూడు నెలలకు, ఆరునెలలకోకసారి పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే ఎఫ్డీ టర్మ్ పూర్తికాకుండా, డబ్బును విత్‌డ్రా చేయడానికి అనుమతించరు. అలా ముందస్తు విత్‌డ్రాయల్ తప్పనిసరి అయితే, అందుకు మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ వడ్డీ శాతం
ఆర్బీఎల్ 6.25
ఇండస్ఇండ్ 6.00
ఐడీఎఫ్సీ ఫస్ట్ 5.75
డీసీబీ 5.55
కరూర్ వైశ్యా 5.40
బ్యాంక్ వడ్డీ శాతం
ఇండస్ఇండ్ 6.50
ఆర్బీఎల్ 6.50
బంధన్ 6.25
డీసీబీ 6.25
ఐడీఎఫ్సీ ఫస్ట్ 5.75