10 వేల ఏళ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం.. ఉత్తర భారతం వైపు పొగ మబ్బులు
ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్‌డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.
- ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో బద్ధలైన హైలీ గుబ్బి
- పలు విమాన సర్వీసులపై ప్రభావం
న్యూఢిల్లీ: ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్‌డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ పొగ మబ్బులు 10-15 కి.మీ. మేరకు ఎగసిపడినట్లు టౌలౌస్ వొల్కానిక్ యాష్ అడ్వయిజరీ సెంటర్ శాటిలైట్ ద్వారా అంచనా వేసింది. ఇవి ఎర్ర సముద్రంపై నుంచి తూర్పు దిశగా వ్యాపిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఒమన్, యెమెన్‌లపై వీటి ప్రభావం పడింది. ఉత్తర భారతంవైపు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ప్రాంతం గుండా విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఢిల్లీ, జైపూర్ మీదుగా ప్రయాణించే విమానాలపై పడే ప్రభావాన్ని భారత విమానయాన శాఖ అంచనా వేస్తున్నది. సోమవారం కొన్ని విమానాల ప్రయాణ మార్గాలను మార్చింది. కన్నూర్ నుంచి అబుదాబి వెళ్లవలసిన ఇండిగో 6ఈ 1433 విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

