హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. సుదీర్ఘంగా వెయిటింగ్లో ఉన్న పలువురికి కీలక పోస్టులు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రేడ్లకు చెందిన మొత్తం 91 మంది మున్సిపల్ కమిషనర్లు, అధికారులను బదిలీ చేస్తూ మున్సిపల్ పరిపాలనశాఖ కార్యదర్శి డాక్టర్ కేటీ శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అమలు చేయాల్సిందిగా మున్సిపల్ పరిపాలనశాఖ జాయింట్ డైరెక్టర్ టీఎస్వీఎన్ త్రిల్లేశ్వర్రావు శనివారం ఎండార్స్మెంట్ విడుదల చేశారు.
దీర్ఘకాలంగా పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న పలువురు గ్రూప్-1, వివిధ గ్రేడ్ల అధికారులకు ఈ ఉత్తర్వుల ద్వారా నూతన బాధ్యతలు అప్పగించారు. బదిలీ అయిన అధికారులందరినీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మలాజిగిరి కమిషనర్లు, సంబంధిత జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ బదిలీల వల్ల స్థానచలనం కలిగి, ఎలాంటి పోస్టింగ్ లభించని అధికారులు తదుపరి ఆదేశాల కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని జీవోలో పేరొన్నారు.